ఆళ్లగడ్డ పట్టణంలో శ్రీ కాశిరెడ్డి నాయన మెగా పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం వారి ఆధ్వర్యంలో ఆదివారం శాఖాహార విశిష్టతపై పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరుణ, శాంతి, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు శాఖాహార భోజనాన్ని ప్రతి ఒక్కరూ భుజించాలని పిరమిడ్ మాస్టర్లు పిలుపునిచ్చారు. ఏ ఒక్క ప్రాణిని చంపే హక్కు ఎవరికి లేదని తెలిపారు.