తూఫ్రాన్ లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముందుగా రత్నాపూర్ గ్రామంలో హల్ది వాగు వంతెన నిర్మాణ పనులు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. జాప్యానికి గల కారణాలు ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటూ సత్వరమే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ఉపయోగం లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలిస్తూ త్వరితగతిన ఇండ్లు నిర్మించుకోవాలని పేదవారి సొంతింటి కల నెరవేర్చుకోవాలని అన్నారు గ్రామ పరిసరాలను పరిశీలిస్తూ ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండలన్నారు.