వికారాబాద్ జిల్లాలో పలు మండలాలలో రేషన్ దుకాణాలను అంగన్వాడి సెంటర్లను మధ్యాహ్న భోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలే శ్రీనివాస్ రెడ్డి మూలకుంట భారతి రంగినేని శారద ఓరుగంటి ఆనంద్ సభ్యులు కూడా సందర్శించనున్నారు. అందులో భాగంగా వికారాబాద్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు బుధవారం రాగ వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగానాయక్ వారికి పుష్పగుచ్చా మిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శ్రీనివాస్ ఆర్డిఓ వాస్చంద్ర డివో రేణుక దేవి, dmho లలితాదేవి పాల్గొన్నారు.