అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ కాలనీలో డెంగ్యూ కేసు నమోదైన ఇంటిని సర్కిల్ డిప్యూటీ కమిషన, డాక్టర్ ఏ ఎం ఓ హెచ్ సోమవారం పరిశీలించారు. వెంటనే ఏంటమ్మాలజీ సిబ్బంది పైరాత్రి కెమికల్ స్ప్రే, ఆంటీ లార్వా ఆపరేషన్ చేపట్టారు. చుట్టుపక్కల ఇళ్లలో నీటి నిలువలను తనిఖీ చేసి, దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు పాల్గొన్నారు.