యూరియా కోసం లైన్లో చెప్పులు రోజురోజుకు రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సొసైటీలకు యూరియా వస్తుంది అని తెరవడంతో రాత్రింబవళ్లు సొసైటీ దగ్గరే రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో సొసైటికి మంగళవారం యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు తెల్లవారుజాము నుంచి చెప్పులను లైన్లో పెట్టి యూరియా కోసం వేచి చూస్తూ ఉన్నారు. అనంతరం అధికారులు వచ్చి రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేశారు. పోరండ్ల గ్రామంలో కూడా పోలీసుల బందోబస్తు మధ్య యూరియా సరఫరా చేయడం జరిగింది.