కుందుర్పి మండలం నిజవల్లి గ్రామంలో బుధవారం మారెమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌని ప్రభాకర్ ఆధ్వర్యంలో చెక్కభజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారులు నృత్యం చేస్తూ చెక్కభజన చేశారు. చెక్కభజనను గ్రామస్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ఈరోజు సాయంత్రం, రాత్రి కూడా చెక్కభజన కార్యక్రమం ఉంటుందని సర్పంచ్ ప్రభాకర్ ప్రకటించారు.