స్వర్ణాంధ్ర-స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు ప్రజలందరూ భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా కృషి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ ఆవరణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ లు పాల్గొన్నారు. కలెక్టరేట్ లో విస్తృతంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పిచ్చిమొక్కలు, చెత్త వ్యర్థాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తొలగించారు. అదే విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాము నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. *