ప్రకాశం జిల్లా ఒంగోలులో వైద్యశాఖ కార్యాలయంలో గురువారం డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు జిల్లా వైద్య శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర వైద్యశాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు పాల్గొని వారు ఇచ్చిన సూచనలు సలహాలను స్వీకరించారు. సీజనల్ వ్యాధులను అరికట్టే అంశంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు వైద్యశాఖ అధికారులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా దోమకాటు అతి సార వంటి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు.