విద్యార్థుల సమస్యల గురించి పోరాడుతున్న సంఘాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని శ్రీ సత్యసాయి జిల్లా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పుట్టపర్తిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లలోకి వెళ్లడానికి తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు మాత్రమే అనుమతి ఇచ్చి, విద్యార్థి సంఘాలకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఈనెల 25న విద్యార్థి సంఘాలతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు.