కొమ్మాదిలో ఒకరు అదృష్యమైన ఘటన సోమవారం చోటు చేసుకుంది. దంతులూరి సాంబ మూర్తి రాజు వయసు 64 మై హోమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302, కొమ్మాదిలో నివాసం ఉండేవారు. సోమవారం సాయంత్రం నుండి కనిపించడం లేదని అతని భార్య మృతి చెందినప్పటి నుండి మానసికంగా కుంగిపోయారని ప్రస్తుతం డిప్రెషన్ లో ఉన్నట్లు పీఎం పాలెం పోలీసులు తెలిపారు. దంతులూరి సాంబ మూర్తి రాజు సమాచారం తెలిసినవారు పీఎంపాలెం పోలీసులకు తెలపాలని కోరుతున్నారు.