అతి వేగంతో వెళ్లి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడ్డ ఘటన కరీంనగర్ మండలం ఇరుకుల్ల రహదారి బ్రిడ్జి పై శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం గొల్లపల్లి నుంచి కరీంనగర్ వైపు మర్రి రాజశేఖర్ తన సొంత ట్రాక్టర్ తో ఇసుక లోడ్ చేసుకొని అతివేగంతో అజాగ్రత్తగా వెళ్తుండటంతో అదుపుతప్పి బ్రిడ్జి పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో చాలసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో కరీంనగర్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసి ట్రాక్టర్, డ్రైవర్ మర్రి రాజశేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు.