యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వ తప్పిదాన్ని, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం పై వేస్తున్నారని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ యూరియా సరఫరా విషయంలో చేసిన వాఖ్యాలను తప్పుబట్టారు.ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మెన్ రూప్లా నాయక్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. రాష్ట్రాలకు యూరియా సప్లై చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి కోతలు విధించింది అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.