శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో మిలాద్-ఉన్-నబీను పురస్కరించుకొని ముస్లిం మతపెద్దల ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి పట్టణ సిఐ నారాయణరెడ్డి సిబ్బంది ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అదేవిధంగా పెద్ద సంఖ్యలో మైనారిటీలు రక్తదానంలో పాల్గొన్నారు. సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.