శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల పరిధిలోని రాగన్నగారిపల్లి, ఉప్పార్లపల్లి గ్రామాలలో వైద్యాధికారిని డాక్టర్ అలేఖ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే వారికి ఉచితంగా మందులను అందించారు. అనంతరం గ్రామంలో ఫీవర్ సర్వేను నిర్వహించారు.