వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. జాతర వేడుకల్లో భాగంగా 4 వ రోజు బుధవారం రాత్రి త్రిభువని సెంటర్లో క్రాకర్స్ ఫెస్టివల్ నిర్వహించారు. సుమారు అరగంటసేపు క్రాకర్స్ పేలుతూనే ఉండడంతో మొత్తం క్రాకర్స్ కాంతులతో వెలిగిపోయింది. క్రాకర్స్ ఫెస్టివల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. క్రాకర్ ఫెస్టివల్ వీక్షించేందుకు త్రిభువని సెంటర్ వద్దకు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు.