మోపిదేవి సొసైటీ ఛైర్మన్ గా పరుచూరి శ్రీనివాసరావు మోపిదేవి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంఛైర్మన్ గా పరుచూరి శ్రీనివాసరావు పూర్తి బాధ్యతలు స్వీకరించారు. గురువారం మద్యాహ్నం 3 గంటల సమయంలో సొసైటీ కార్యాలయంలో చైర్మన్ గా శ్రీనివాసరావుతో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులుగా కారుమూరి ప్రసాద్, కొలుసు శ్రీనివాసరావు కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావుతో మాట్లాడుతూ.. సహకార సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.