నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలో నిర్మించిన తెలంగాణ అమరవీరుల పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ మరుగున పడిన చరిత్రను వెలికి తీసిన వేచుకు పలువురు అభినందనలు తెలియజేశారు. పదిమంది విద్యార్థుల త్యాగాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విహెచ్ తెలియజేశారన్నారు. బిజెపి ప్రజాస్వామ్య విలువలను దొంగలు తొక్కుతూ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీలు పాల్గొన్నారు.