కొరిశపాడు పశువుల వైద్యశాలను మంగళవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాల నందు రికార్డులను తనిఖీ చేసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్ రాంబాబు పనితీరును మెచ్చుకొని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా హాస్పిటల్ లో పర్యవేక్షించడం జరిగిందని అన్నారు. పమిడిపాడు నూతన హాస్పటల్ కు ప్రతిపాదనలు పంపుతామని ఆయన తెలియజేశారు. చందలూరు కొరిశపాడు హాస్పిటల్స్ మరమ్మతులకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.