సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన వరపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన వివిధ ప్రజావాణి దరఖాస్తుదారుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయడానికి కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.