మంగళవారం అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలంలో రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి హోదాలో మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా అబ్బవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా భారీగా హాజరైన తెదేపా శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నోటి నుండి అన్నా అనే పదం ఒక్క ఎన్టీఆర్ సొంతమని, అటువంటి గొప్ప నాయకుడు స్థాపించిన పార్టీలో కొనసాగుతూ రాజంపేట ఇన్చార్జ్ హోదాలో పెరవల్లి మండలానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్టీఆర్ స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు , లోకేష్ అండదండలతో రాజంపేట నియోజకవర్గం అభివృద్ధి పథ