ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం లింగారెడ్డి కాలనీలోని ప్రభుత్వ పాఠశాల నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులకు వర్షాకాలం కలిగే అనారోగ్య సమస్యలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించినట్లు హెచ్ఎం మౌలాలి తెలిపారు. చేతుల శుభ్రత పాటించి ఆరోగ్య సూత్రాలను పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.