పోలీసు వాహనమే అంబులెన్స్ అయింది. గుంటూరు శివారు ప్రాంతమైన తాకెళ్లపాడు బైపాస్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురు గాయపడ్డారు. టాటా మ్యాజిక్ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా పరారయ్యాడు. వెంటనే సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న పాత గుంటూరు ఎస్ ఐ ప్రసాద్ పోలీసు వాహనంలోనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.