గుడివాడలోని వెలుగు కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న మహిళ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టీడీపీ నాయకుడు, సహోద్యోగుల వేధింపులే దీనికి కారణమని ఆమె భర్త ఆరోపించారు. ఉద్యోగం మానేయాలని వేధించారని, వ్యక్తిగత జీవితంపై వాట్సాప్ గ్రూపుల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. సీతామహాలక్ష్మి ప్రస్తుతం గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.