విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్ ను సందర్శించి, టికెట్ కౌంటర్ ప్రదేశమును మరియు రైల్వే ఎంక్వయిరీ రూమ్ నకు సంబంధించిన సిబ్బందితో మాట్లాడి ప్రయాణికులకు వారు ఇచ్చే సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికుల విశ్రాంతి గదులను, మరియు మూత్ర విసర్జన గదుల, మరియు ఫ్లోర్ శానిటైజేషన్ను,వాటి మెయింటినెన్స్ తదితర పరిశుభ్రత అంశాలు గురించి సమీక్షించారు. రైల్వే స్టేషన్ అధికారులు, స్టేషన్ మేనేజర్,సిబ్బందితో కలిసి రైల్వే ప్లాట్ ఫామ్ పనులు పురోగతిని, స్టేషన్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విజయనగరం రైల్వే స్టేషన్