తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పలు గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సామూహిక ఎలకల నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. రైతు సేవ కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారులు రైతుల సమక్షంలో ఈ మందును కలిపి ఉచితంగా పంపిణీ చేశారు. అందరూ ఒకేసారి ఎలుకల నియంత్రణ కార్యక్రమం చేపట్టడం ద్వారా పంటను కాపాడుకోగలుగుతామని మండల వ్యవసాయ శాఖ అధికారి చేర్ల రవికుమార్ మొంజుపాడులో మాట్లాడుతూ తెలియజేశారు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి సర్పంచులు గ్రామస్తులు పాల్గొన్నారు