సులభతర వ్యాపారంపై భారత ప్రభుత్వం నిర్వహించే సర్వేలో సానుకూల స్పందన వల్ల రాష్ట్రానికి మరియు అన్నమయ్య జిల్లాకు మరిన్ని పెట్టుబడులు సాధ్యమని, అన్నమయ్య జిల్లాలో వ్యాపార సౌలభ్యానికి జిల్లా యంత్రాంగం చేయూతనందిస్తుందని, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి పేర్కొన్నారు.గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి అధ్యక్షతన బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ (BRAP) 2024 అవుట్ రీచ్ కార్యక్రమాన్ని జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.