సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండలం కంకోల్ పరిధిలోని వోక్సాన్ యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థి రిషికేష్(19) ఉరివేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఆర్కిటెక్చర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని అతడు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు తెలిపారు. రిషికేశ్ స్వస్థలం హైదరాబాదులోని సరూర్నగర్ ప్రాంతమని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.