నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేలలోని అతి పురాతనమైన మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజాలు చేసి మహా హారతి కార్య క్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చి హారతి తీసుకున్నారు. వర్షాన్ని లెక్కచేయకుండా హారతి కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు.