కొనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని ప్రజా సంఘాలు బహిష్కరించాయి. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజలకు తెలియజేసి చైతన్యం చేయవలసిన అధికారులు డుమ్మా కొట్టడం వలన సమస్యలను, హక్కులను ప్రజలు తెలుసుకోలేక పోతున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ సివిల్ రైట్ను బహిష్కరించామని వారు తెలిపారు.