అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ అన్నారు. మూలపేట గ్రామ సర్పంచ్ జీరు బాబూరావు ఇంటిపై టీడీపీ నాయకులు దాడి చేసేందుకు యత్నించడమే కాకుండా ఆయన బంధువు రామారావుపై పోలీసులతో దాడి చేయించారని తిలక్ ఆరోపించారు. దాడి చేసిన నౌపడ ఎస్ఐపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గురువారం రాత్రి టెక్కలి డీఎస్పీ లక్షణరావుకు గ్రామస్థులతో కలిసి ఫిర్యాదు చేసారు.