మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్ స్ట్రాచర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శనివారం పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 9న అంకుల్ షాపూర్ లో అర్థ కాంతమ్మ అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడును దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మల్కాజ్గిరి ఏసిపి చక్రపాణి ఘట్కేసర్ సిఐ బాలస్వామి డిఐ శ్రీనివాస్ నేతృత్వంలోని క్రైమ్ టీం 48 గంటల్లోనే నిందితులను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.