ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి స్వామి జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్, భూ పరిహారం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.