కడప జిల్లా జమ్మలమడుగులోని సంజామలమోటులో ఉన్న చక్రా ఫంక్షన్ హాల్లో ఆదివారం జమ్మలమడుగు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు పివి శివారెడ్డి హాజరైనారు. డిపో ప్రెసిడెంట్ పిబ్రహ్మం అధ్యక్షతన నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉద్యోగస్తుల కోరిక మేరకు జమ్మలమడుగు డిపో ప్రెసిడెంట్ గా బ్రహ్మం , డిపో వైస్ ప్రెసిడెంట్ గా రవిబాబు,వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంతయ్య, డిపో కార్యదర్శిగా ఎం జి సి ఓ రెడ్డి, డిపో అడిషనల్ కార్యదర్శిగా నాగేంద్రను ఏకగ్రీవంగా ప్రకటించారు.