పెడన లో మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ నాగేంద్ర ప్రసాద్ సూచించారు. బుధవారం ఎస్ఐ జి. సత్యనారాయణతో కలిసి ముస్లిం మైనార్టీ పెద్దలతో సమావేశమై మాట్లాడారు. ప్రార్థన అనంతరం ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పండుగను సఖ్యతా వాతావరణంలో జరిపితేనే నిజమైన ఉత్సవం అవుతుందని ఆయన పేర్కొన్నారు.