అనంతపురం నగరంలోని చెరువు కట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు కాలు మీద నుంచి వెళ్లి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. కూలీలతో నిలబడి ఉండగా ఒక్కసారిగా ఆర్టీసీ బస్సుకు సంబంధించిన టైరు కాలి మీద వెళ్లడంతో కాలు పూర్తిగా నల్లగా మారింది. దీంతో అతనిని వారి కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.