భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం గాంధీనగర్ వద్ద గల మిషన్ భగీరథ ఫిల్టర్ పంప్ హౌస్ ముందు గురువారం ఉదయం 11 గంటలకు ఔట్సోర్సింగ్ కార్మికులు ధర్నా చేపట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు ఔట్సోర్సింగ్ కార్మికులు.