వినాయక నిమజ్జనం ఒంగోలు నగరంలోని విధుల్లోకి ప్రవేశించిన వెంటనే డిజె సౌండ్లు ఆపాలని చెప్పిన పోలీసులపై యువకులు తిరగబడి దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీనిని సమర్థిస్తూ వైసిపి నేతలు డిఎస్పీని కలిసి ఫిర్యాదు చేసే విషయంలో కొద్దిపాటి ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి డీజే సౌండ్లు ఆపమని చెప్పిన పోలీసులపై ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని 45వ వార్డు మారుతీ నగర్ కు చెందిన యువకులు మద్యం మత్తులో దాడి చేయడాన్నీ పోలీస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది.