కరీంనగర్ పట్టణంలోని గోదాంగడ్డలో పెట్రోల్ దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఓ ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల నుంచి పెట్రోల్ దొంగిలిస్తుండగా సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ ప్రాంతంలో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రత చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ తీస్తున్న సమయంలో రికార్డు అయిన సీసీ కెమెరా వీడియో ఆదివారం వైరల్ గా మారింది.