పాత గాజువాక జంక్షన్లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రద్దీగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఒక వ్యక్తిని ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నా అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. కాగా మృతుడి వివరాలు తెలియ రావాల్సి ఉంది.