ఉచిత బస్సు శ్రీశక్తి పథకం ప్రారంభం కావడంతో తమ జీవనాధారం దెబ్బతిన్నదని వాపోయిన ఆటో కార్మికులు, నష్టపరిహారంగా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.12వేలు భృతి అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు పట్టణ కలెక్టరేట్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టి ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా సీఐటీయూ ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి మైనుర్ మాట్లాడుతూ... “ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు, విద్యార్థులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నారు. దీంతో ఆటో కార్మికుల ఆదాయం తీవ్రంగా పడిపోయింది. రోజువారీ కుటుంబ ఖర్చులు కూడా మోయలేని స్థితి ఏర్పడింది. కనీసం జీవ