సంగారెడ్డి జిల్లా కోహిర్ పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొన్నారు. కోహిర్ పట్టణంలో నెలకొల్పిన వినాయక మండపంలో శుక్రవారం రాత్రి బి ఆర్ ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా మంటప నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వివిధ మండలాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.