ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ అధికారులు రైతులకు మరియు వ్యవసాయ శాఖ సిబ్బందికి ఎరువుల వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రసాయన ఎరువులను వాడకం వల్ల కలుగు అనర్ధాలను వివరించారు. అలానే నానో ఎరువులు వాడటం వల్ల కలుగు ప్రయోజనాలను వివరించి నానో ఎరువులు ఉపయోగించాలని అధికారులు రైతులకు తెలిపారు. ఎక్కడ ఎరువుల కొరత లేదని ఎవరైనా ఎరువులు లేవని చెబితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి మరియు రైతులకు అధికారులు సూచించారు.