ఎరువులను అధిక ధరలకు విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు హెచ్చరించారు. నరసరావుపేటలోని ఎరువుల దుకాణాలను ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత, విజిలెన్స్ అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో స్టాక్ రిజిస్టర్ను, బిల్ బుక్స్ను పరిశీలించారు. యూరియా నిల్వల్లో తేడా ఉన్నందున 108 బస్తాల అమ్మకాలను నిలిపివేశారు.