Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశానికి హాజరైనట్లు జేఏసీ చైర్మన్ బూరుగు రవి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పెన్షన్ విద్రోహ దినమైన సెప్టెంబర్ 1న నిర్వహించే సిపిఎస్ రద్దు నిరసన కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నల్ల బ్యాడ్జీలు ధరించి కొనసాగుతుందన్నారు రవికుమార్.ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.