ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు పెదమట్లంక గ్రామంలో త్రాచుపాము హల్చల్ చేసింది. స్థానిక నివాసి దూనబోయిన సూర్య సూర్యచంద్రరావు ఇంట్లోకి పాము ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న వర్మ పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. వర్షాలు నేపథ్యంలో పాములు పట్ల అప్రమత్తంగా ఉండాలని వర్మ సూచించారు.