Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 26, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావముతో రంపచోడవరం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన జల్లులకు జనజీవనం స్తంభించింది. రంపచోడవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగితో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఈ జల్లులకు ప్రజలు పనుల నిమిత్తం బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.