వేంపల్లి మేజర్ గ్రామపంచాయతీని మరో తురక పాలెం చేయవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు ,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి,పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేంపల్లి గ్రామపంచాయతీ దుస్థితికి నిరసనగా కాంగ్రెస్ నాయకులు సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి ప్రధానమంత్రి స్వచ్ఛభారత్ అని ,CM స్వచ్చంధ్రప్రదేశ్ ,ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ,స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెబుతున్నారని చెప్పారు.