Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
వ్యవసాయ క్షేత్రంలోని చిన్న కొలనులో మునిగి బాలుడు మృత్యువాత పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన ఓదెలు బన్నీ అనే (14) సంవత్సరాల యువకుడు ఆదివారం సెలవు దినం కావడంతో ఈతకు వెళ్ళాడు ఈ క్రమంలోని గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఈతకొట్టుటకు అందులో దూకాడు. దీంతో ప్రమాదవశాత్తు అందులోనే మునిగి మృతి వాత పడ్డాడు. మృతుని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎస్సై రమేష్ ఆదివారం మధ్యాహ్నం 2:40 గంటలకు వెల్లడించారు.