మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గం మండల కేంద్రంలో శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యవసర వస్తువులపై జిఎస్టి 12 శాతం నుంచి 5శాతానికి తగ్గించడంతో హర్షం వ్యక్తం చేస్తూ బిజెపి శ్రేణులు అల్లాదుర్గం మండల కేంద్రంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య ప్రజలపై పనుల భారం తగ్గించేందుకు కేంద్రం తీసుకొస్తున్న నిర్ణయం పై వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.