నల్లగొండ జిల్లా కేంద్రంతోపాటు జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు వినాయకుడి విగ్రహాలను తమ మండపాల్లో ప్రతిష్టించడానికి భక్తులు విగ్రహాల తయారు కేంద్రాల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ వాహనాల్లో డబ్బులు సప్పులతో గానుగా ఊరేగిస్తూ విగ్నేశ్వరుడి విగ్రహాలను మండపాలకు తీసుకువెళ్తున్నారు దీంతో వినాయక తయారు కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొనే ఉంది.